- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబును ఎంటిపిఎల్ (మోల్డ్ టెక్ ప్యాకింగ్ లిమిటెడ్) ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో కలిశారు. తమ పరిశ్రమలను మూడు ప్రాంతాల్లో విస్తరించనున్నట్లు తెలిపారు. తమిళడనాడు, హర్యానా,తెలంగాణ ప్రాంతాల్లో సుమారు రూ.100 కోట్లు పెట్టుబడులతో తమ సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సంస్థల ఏర్పాటుతో ఉత్పత్తి సామర్ధం 5,500 టన్నులకు చేరుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటామన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటుతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
- Advertisement -