Saturday, November 16, 2024

తెలుగు రాష్ట్రాలలో విస్తృత శ్రేణి పొడిలను విడుదల చేసిన ఎంటీఆర్‌ ఫుడ్స్‌

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్‌ తెలుగు ఆహార మార్కెట్‌లో తమ స్ధానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఎంటీఆర్‌ ఫుడ్స్‌ ఇప్పుడు విస్తృత శ్రేణిలో పొడులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్‌ల కోసం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో అధిక శాతం ఇళ్లలో అన్ని భోజన సందర్భాలలోనూ పొడి అతి సాధారణంగా కనిపిస్తుంటుంది. వీటిని సంప్రదాయబద్ధంగా గృహిణిలే చుట్టుపక్కల కిరాణా మరియు జనరల్‌ స్టోర్స్‌ నుంచి పదార్ధాలను కొనుగోలు చేసి తయారు చేస్తారు. అయితే, రుచి మరియు నాణ్యతలు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంటాయి. దీనికితోడు తాజాదనంతో కూడిన పదార్ధాల లభ్యత కూడా కష్టంగానే ఉంటుంది. ఈ ఆందోళనలను పరిష్కరిస్తూ ఎంటీఆర్‌ ఫుడ్స్‌ తెలుగు మాతృమూర్తులతో కలిసి పనిచేయడంతో పాటుగా అత్యధికంగా తినడానికి అమితాసక్తి చూపే మూడు పొడిలు– కంది, ఇడ్లీకారం, కరివేపాకు పొడిని విడుదల చేసింది. ఈ శ్రేణి పొడిలు తెలుగిళ్లకు సంప్రదాయ, అత్యంత రుచికరమైన, ఇంటిలో తయారుచేసుకున్న పొడిల రుచిని అందిస్తాయి. కేవలం నాణ్యమైన ముడి పదార్ధాలు మాత్రమే వినియోగించడం వల్ల సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండగలవనే భరోసా అందిస్తారు. ఈ ఉత్పత్తులను 20 గ్రాముల ప్యాక్‌ను 10 రూపాయలకు, 100 గ్రాముల ప్యాక్‌ను 45 రూపాయలకు అందిస్తారు.

MTR Foods launches new products

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News