Tuesday, December 24, 2024

ముచ్చింతల్‌కు విశ్వఖ్యాతి

- Advertisement -
- Advertisement -

Muchintal as famous spiritual center: President

సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై

మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా దివ్యక్షేత్రంలోని 120 కిలోల బంగారంతో తయారు చేసిన భగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తిని రాష్ట్రప తి రామ్‌నాథ్‌కోవింద్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ ప్రత్యేక తొలిపూజలు నిర్వహించి లోకార్పణ చేశారు. ఈ క్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామీజి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ దంపతులు , ఆయన కూతురు స్వాతి కోవింద్‌కు 120 కేజీల సువర్ణమూర్తి విశిష్టతలను వివరించా రు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామీజీ బంగారు శఠగోపంతో రాష్ట్రపతి కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. కాగా శ్రీరామనగరం చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిన జీయర్ స్వామీ జీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. సమతా క్షేత్రంలో రాష్ట్రపతికి పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ కుటంబసభ్యులతో కలిసి 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహంతో పాటు సమతాక్షేత్రంలోని 108 దివ్యదేశాలను సందర్శించారు. చిన జీయర్‌స్వామీజీ దివ్యక్షేత్రాల విశిష్టతలను, సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రం విశేషాలను రాష్ట్రపతి కుటుంబానికి వివరించారు. అనంతరం రాష్ట్రపతి దంపతులకు ప్రతిమను వారు బహూకరించి సత్కరించారు.

స్వర్ణమూర్తిని ఆవిష్కరించడం అదృష్టం : రాష్ట్రపతి

శ్రీభగవద్రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకావిష్కరణ చేయడం తన అదృష్టమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీభగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఆదిశేషుడే కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించారని, భగవంతుడిని ప్రార్థించడానికి అందరికీ అర్హత ఉందని రామానుజాచార్యులు వెయ్యేళ్లక్రితమే చెప్పారన్నారు. భక్తి మనసును భట్టి ఉంటుంది కానీ కులాన్ని బట్టి ఉండదని చాటిచెప్పారన్నారు. కులాలతో సంబంధం లేకుండా భక్తితోనే ముక్తి లభిస్తుందని ఉపదేశించారని, పీడిత వర్గాల కోసం రామానుజా చార్యులు వైష్ణవ ఆలయాల ద్వారాలు తెరిచారన్నారు. రామానుజాచార్యుల శిష్యుల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారే ఉన్నారన్నారు. రామానుజాచార్యులు భక్తితో భారతీయులను ఏకతాటిపైకి తె చ్చిన మహనీయులని, సమతామూర్తి విగ్రహ ఏర్పాటు స్ఫూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం లోకార్పణ చేయడంతో దేశంలో నవశకం ప్రారంభమైందన్నారు రాష్ట్రపతి. తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విలసిల్లుతుందన్నారు.

108 దివ్యదేశ ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేయడందో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నా రు. దక్షిణభారత భక్తి సంప్రదాయాన్ని దేశం మొత్తానికి పరిచయం చేసింది శ్రీభగవద్రామానుజాచార్యులేనని, భారత్ వసుధైక కుటుంబం అనేభావన కల్పించింది కూడా శ్రీభగద్రామానుజాచార్యులేనన్నారు. అంబేద్కర్, గాంధీజీ, స్వామీ వివేకానంద రామానుజాచార్యుల స్ఫూర్తితోనే సమాజం లో అసమానతలపై పోరాడారని, అంబేద్కర్‌కు రామానుజాచార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయన్నారు. రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం, సమానత్వం అంశాలను చేర్చేందుకు రామానుజాచార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయన్నారు. మహారాష్ట్రలోని అంబేద్కర్ స్వస్థలం తరహాలోనే శ్రీరామనగరంలో సమానత్వం వెల్లువిరుస్తుందన్నారు. రామనుజాచార్యుల చరిత్ర చదివాకే గాంధీజీ పోరాటం మొదలైందన్నారు. గాంధీజీపై రామానుజాచార్యుల బోధనల ప్రభావం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివరించారు.

వెయ్యేళ్ల క్రితమే కృషి: చిన జీయర్ స్వామి

వెయ్యేళ్ల క్రితమే కుల వివక్షను పారదోలేందుకు శ్రీభగద్రామానుజాచార్యులు కృషిచేశారని చిన జీయర్ స్వామీ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ కుటుంబసమేతంగా విచ్చేసి రామానుజాచార్యుల సువర్ణమూర్తిని ఆవిష్కరించి లోకార్పణ చేయడం ఆనందంగా ఉందన్నా రు. కులాలకతీతంగా భక్తులు ఇచ్చిన విరాళాలతో రామానుజాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు చేశామని, రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా కొనసాగుతున్న సమయంలో కాశీ పునరుద్ధరణ జరిగిందని, అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మాణమవుతోందన్నారు.

సువర్ణమూర్తిని దర్శించిన కేంద్ర మంత్రి

దివ్యక్షేత్రంలోని 216 అడుగుల సమతామూర్తిని ఆదివారం నాడు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ దర్శించుకున్నారు.అలాగే రాష్ట్రపతి ఆవిష్కరించిన120 కేజీల సువర్ణమూర్తిని దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. నేత్ర విద్యాలయ విద్యార్థులు రూపొందించిన అంధులు ఉపయోగించే ప్రత్యేకమైన వాయిస్ స్టిక్‌ను కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కులం కన్నా గుణం గొప్పదని రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే ప్రబోదించారని, నరుల సేవే నారాయణ సేవగా రామానుజాచార్యులు భావించారని వివరించారు. రామానుజాచార్యుల భారీ విగ్రహ సమానత్వానికి ప్రతిరూపకంగా నిలుస్తోందని, రామానుజాచార్యుల బోధనలు యువతకు, భవిష్యత్ తరాలకు ప్రేరణ కలిగిస్తాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News