Monday, December 23, 2024

హెడ్‌ కానిస్టేబుల్ హల్‌చల్… కారుతో ఢీకొట్టి 200 మీటర్లు లాక్కెళ్లాడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముచ్చింత్‌లో హెడ్‌కానిస్టేబుల్ హల్‌చల్ చేశారు. దంపతులను కారుతో ఢీకొట్టి 200 మీటర్లు కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముచ్చింతల్‌లో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఓ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ముచ్చింతల్ తన ఇంటి ముందు ఎవరు వెళ్లిన దూషించేవాడు. మచ్చింతల్‌లో ధారకృష్ణ-బాలమణి అనే దంపతులు తన కుమారుడు పవన్‌తో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పవన్ హెడ్ కానిస్టేబుల్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా జ్ఞానేశ్వర్ దూషించాడు.

Also Read: కదిలే కారు టాపుపై కూర్చుని మద్యం తాగుతూ… (వైరల్ వీడియో)

ఇద్దరు మధ్య గొడవ జరగడంతో జ్ఞానేశ్వర్ తన కుమారుడితో కలిసి పవన్‌పై దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇదే విషయంలో బాలమణి- ధారకృష్ణ, గ్రామస్థులతో కలిసి జ్ఞానేశ్వర్‌ను నిలదీశారు. దీంతో గొడవ పెద్దదిగా జరగడంతో కారు తీసి వారిపైకి దూసుకెళ్లాడు. తప్పించుకునే క్రమంలో రాజు కారు బానెట్‌పై పడ్డాడు. దీంతో రాజు రెండు వందల మీటర్ల దూరం తీసుకెళ్లాడు. అనంతరం చంపేస్తామని రాజును జ్ఞానేశ్వర్ బెదిరించాడు. గాయపడిన బాలమణి, రూప, పవన్, రాజులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News