Monday, December 23, 2024

సిద్దరామయ్య భార్యను నాలుగు గంటలు ప్రశ్నించిన లోకాయుక్త పోలీసులు

- Advertisement -
- Advertisement -

మైసూరు: మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంయుడిఏ) స్థలాల కేటాయింపు వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త పోలీసులు శుక్రవారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బి.ఎం.పార్వతిని మైసూరులో నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. మైసూరులోని విజయనగర్ లో కేటాయించిన 14 వేర్వేరు స్థలాల కేటాయింపు ప్రశ్నించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆమెను ప్రశ్నించారు. అన్ని ప్రశ్నలకు జవాబులివ్వడమే కాక, అన్ని దస్తావేజులు సమర్పించినట్లు తెలిసింది.  లోకాయుక్త పోలీసులు గురువారం ఆమెకు నోటీసులు జారీ చేశారని తెలిసింది. 14 వేర్వేరు సైట్లు ఎలా కేటాయించారన్న దానిపై ఆమెకు నోటీసులు ఇచ్చారు.

సిద్దరామయ్య, తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైసూరులోని ఆర్టిఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై వారు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్ లో పార్వతిని రెండో నిందితురాలిగా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News