Monday, December 23, 2024

ఆనారోగ్యంతో ముద్దపూర్ సర్పంచ్ మృతి

- Advertisement -
- Advertisement -
  • పలువురు నాయకుల సంతాపం

కొండపాక: కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామ సర్పంచ్ తూం ఉమ ఆనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. గత కొంత కాలంగా ఆమె ఆనారోగ్యంతో బాధపడుతుంది. సర్పంచ్ మృతి చెందడంతో పలువురు నాయకులు అధికారులు సంతాపం తెలిపి సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యుడు ,ప్రజాప్రతినిధులు ముద్దాపూర్‌లోని ఆమె నివాసంలో శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలిపారు. ఉమ భర్త అంజిరెడ్డి జడ్పిటిసి సభ్యుడిగా, కుకునూరుపల్లి సర్పంచ్‌గా పని చేశారు. ఆమె ప్రస్తుత సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.

పార్టీకి తీరనిలోటు..

ముద్దాపూర్ సర్పంచ్ ఉమా మరణం పార్టీకి తీరని లోటని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్‌లు అన్నారు. ముద్దాపూర్ సర్పంచ్ ఉమా అంత్యక్రియల్లో ప్రతాప్‌రెడ్డి పాల్గొని పాడే మోసారు. ఉమా భర్త అంజిరెడ్డి, కుమారుడు శ్రీకాంత్ రెడ్డిలను ఓదార్చి సానుభూతి తెలిపారు. బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నూనెకుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పిస్క అమరేందర్, సర్పంచ్‌లు అమ్ముల రమేశ్, బచ్చలి మహిపాల్, శ్రీనివాస్, సంజీవరెడ్డి, నర్సింలున పోల్కంపల్లి జయంతి నరేందర్, ఎంపిటిసిలు ఆరుట్ల కనకయ్య, మంచాల కనకరాములు, నాయకులు తూం మహేందర్, విరుపాక రమేశ్‌రెడ్డి, ఉపేందర్ , నాగరాజు, పల్లె బాబు, రిప్పల స్వామి, మల్లం ఐలయ్య తదితరులు సర్పంచ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News