Wednesday, January 29, 2025

కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ మాజీ ఎంఎల్‌ఎ విఠల్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా, ముథోల్ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ విఠల్ రెడ్డి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ముథోల్ నుంచి ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టిఆర్‌ఎస్ నుండి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2023లో పోటీ చేసిన ఆయన బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ చేతిలో ఓడిపోయారు. రెండు మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న ఆయన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే గురువారం ఆయన సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో పాటు మరో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖానాపూర్ ఎంఎల్‌ఎ వెడ్మ బొజ్జు తదితరులు పాల్గొన్నారు. విఠల్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విఠల్‌రెడ్డి తండ్రి గడ్డెన్న కాంగ్రెస్‌లో పలుమార్లు ఎంఎల్‌ఎగా, మంత్రిగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News