Thursday, January 23, 2025

బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లడతా:ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముదిరాజ్ నుంచి ఎమ్మెల్యేగా ఒక్కన్నే ఉన్న.. అయిన పొత్తుల సద్దిలా ఉన్నానని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కల్వకుర్తిలో ‘ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన సభ‘కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధర్మం కోసం, న్యాయం కోసం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లడతానని ఈటల వెల్లడించారు. మీ గౌరవం తగ్గకుండా మా వాడు శభాష్ అనేలా నా పని విధానం ఉంటుందన్నారు. రాజ్యాధికారంలో మన వాటా వచ్చే వరకు మీతో ఉంటానని వెల్లడించారు.

Also Read: కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

ముదిరాజ్‌లను బిసి డి నుంచి బిసి ఎకి మారుస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. దానిని అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మహబూబ్ నగర్‌లోని 14 నియోజకవర్గంలో ముదిరాజ్, గొల్ల కురుమలు, ఎస్‌సిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎవరు గెలవాలి అని నిర్ణయించే స్థాయిలో ఉన్నారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ముదిరాజ్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చేప పిల్లలకు ఇచ్చే డబ్బులు బ్రోకర్ల పాలు కాకుండా.. నేరుగా సొసైటీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలో ముదిరాజ్ ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News