Thursday, January 23, 2025

ముదిరాజ్‌లకు ఆస్తులు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవం ఉంది: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపిలో అసంతృప్తికి ఆస్కారం లేదని ఆ పార్టీ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ అక్రమ సంపాదనకు ధరణి వేదికైందన్నారు. అధికారంలోకి వస్తే నడ్డా చెప్పినట్లు ధరణిని రద్దు చేస్తామన్నారు. ముదిరాజ్‌లకు ఆస్తులు లేకపోవచ్చని కానీ ఆత్మగౌరవం ఉందన్నారు. ముదిరాజ్‌లను దూషించిన వ్యక్తికి పదవిని కట్టబెట్టిన కెసిఆర్ క్షమాపణ చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. కెసిఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని ప్రజలకు అర్ధమైందన్నారు. ఆర్‌టిసి కార్మికులకు కనీసం పిఆర్‌సి ఇవ్వడంలేదని మండిపడ్డారు.

Also Read: ఈటల రాజేందర్ హత్యకు కుట్రః ఈటల జమున సంచలన ఆరోపణలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News