Sunday, December 22, 2024

ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి దిష్టి బొమ్మ దగ్థం

- Advertisement -
- Advertisement -

చందుర్తి: ముదిరాజ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి దిష్టి బొమ్మను చందుర్తి గ్రామ ముదిరాజ్‌లు సోమవారం దగ్థం చేశారు. ముదిరాజ్, మత్సశాఖ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల బాబు, ఎన్నారై మోతే బాబు ఆధ్వర్యంలో ముదిరాజ్‌లు మండల కేంద్రంలో కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్‌లో దిష్టి బొమ్మను దగ్థం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ముదిరాజ్‌లను హేళన చేస్తూ మాట్లాడిన కౌశిక్‌రెడ్డి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. ఖబర్దార్ కౌశిక్‌రెడ్డి వెంటనే ముదిరాజ్ జాతికి క్షమాపనలు తెలపాలని లేదంటే ఊర్లల్లో తిరగనియ్యకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వల్ల శ్రీను, మట్కాం దేవయ్య, గ్రామ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News