నాగిరెడ్డిపేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వృత్తుల్లో బిసి కులాలకు కూడా ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. నాగిరెడ్డి మండల కేంద్రంలో ముదిరాజులు ఏకమై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కులవృత్తులలో బిసిలను చేర్చకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి వెంటనే బిసి కులాలకు ఆర్థిక సహాయం అందజేయాలి కోరారు. అలాగే ముదిరాజ్ బంధు పథకంలో ముదిరాజ్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ మహ్మద్ షాహిద్ మస్రూర్‌కు వినతి పత్రం అందజేశారు.
ముదిరాజ్ సంఘం ఎల్లారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ విజయ, నాగిరెడ్డిపేట్ మండల అద్యక్షుడు గంపల వెంకయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధిలు నారాయణ, బోయిని కృష్ణ, భూమయ్య, మత్తమాల సిద్దిరాములు, బాసారం గోపాల్, జక్కుల బాలరాజ్, పలువురు సంఘం ప్రతినిధులు ఆయా గ్రామాల నుండి సంఘ సభ్యులు పాల్గొన్నారు.