Wednesday, January 22, 2025

వైసిపిలో చేరిన ముద్రగడ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి, టిడిపి రాజకీయ నాయకులు దూకుడు పెంచారు. వైఎస్‌ఆర్‌సిపి నుంచి మంత్రులు, పలువురు ఎంఎల్ఎలు టిడిపిలో చేరారు. టిడిపిలో కొందరికి ఎంఎల్‌ఎ టికెట్ దక్కకపోవడంతో వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. కొన్ని రోజుల నుంచి ఆయన వైసిపిలో చేరుతారని ప్రచారం జరిగిన విషయం ఇవాళ్టితో స్పష్టమైంది. శుక్రవారం తాడేపల్లి క్యాంపస్ ఆఫీస్‌లో సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడారు. వైసిపిలో చేరడంతో తనకు ఆనందంగా ఉందని పేరొన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని వివరణ ఇచ్చారు. జగన్ పాలనతో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని ప్రశంసించారు. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన విషయం తెలిసిందే.

ముద్రగడ 1978లో జనతా పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఎపిలో నాలుగు సార్లు ఎంఎల్‌ఎ, ఒకసారి ఎంపిగా విజయం సాధించారు. 1999 పార్లమెంటు ఎన్నికలలో టిడిపి తరుపున ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా సేవలందించారు. గత పది సంవత్సరాల నుంచి ముద్రగడ చుట్టూనే రాజకీయ పరిణమాలు తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు కమ్యూనిటికి చెందిన వ్యక్తి కావడంతో ఆ పార్టీలో ముద్రగడ చేరుతారని ప్రచారం జరిగింది. పవన్ తీరు నచ్చక ఆయన జనసేనలోకి వెళ్లలేదు. వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే శుక్రవారం వైసిపిలో ఆయన చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News