అమరావతి: తాను కులాన్ని అడ్డంపెట్టుకొని నాయకుడిగా ఎదగలేదని ముద్రగడ పద్మనాభం తెలిపారు. జనసేన అధినేతకు పవన్ కల్యాణ్ ముద్రగడ బహిరంగా లేఖ రాశారు. తాను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తాను ఉద్యమాలు చేయలేదని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల పోగొట్టుకున్న బిసి రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని స్పష్టం చేశారు. పదే పదే చెప్పడం వల్ల రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారని దుయ్యబట్టారు. తన కంటే చాలా బలవంతులైన పవన్ తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ముద్రగ నిలదీశారు. రూ. కోట్ల సూట్‌కేసులకు అమ్ముడుపోవడానికి తాను ఉద్యమం చేయడంలేదని, జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నప్పుడు తాను ఇచ్చిన సమాధానం ఏంటో అడిగి తెలుసుకో అని పవన్‌కు చురకలంటించారు.
Also Read: మీ సేవ సెంటర్లకు తాకిడి..
తన సమాధానం తరువాత కాపు సామాజిక వర్గానికి రూ. 20 కోట్లు ఇస్తానన్నా వద్దని చెప్పానని గుర్తు చేశారు. బిసిల నుంచి సుభాష్‌ని, కాపుల నుంచి బొత్స సత్యనారాయణను సిఎం చేయమని అడిగానని వివరించారు. తాను ఎవరిని బెదిరించి పెద్దలు, పవన్ దగ్గర రూ. కోట్లు పొందలేదన్నారు. తాను ఎప్పుడు ఓటమి ఎరగనని, కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యానని ముద్రగ వివరించారు. తాను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకో పవన్ అని మండిపడ్డారు. ఎంఎల్‌ఎలను తిట్టడానికి విలువైన సమయాన్ని వృదా చేయకండని పవన్‌కు సూచించారు. ఎపికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పెట్టిన తరువాత పదిమంది చేత ప్రేమించబడాలి కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమంటారు అని పవన్‌పై ముద్రగ దుమ్మెత్తిపోశారు.