Saturday, November 16, 2024

టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ?

- Advertisement -
- Advertisement -

కాపు నేత ముద్రగడ పద్మనాభం త్వరలో తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు గిరిబాబు గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. కొంతకాలంగా ముద్రగడ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2009లో ఆయన పిఠాపురం నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతనుంచీ రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు.

అయితే రానున్న ఎన్నికల్లో తన తండ్రి ముద్రగడతోపాటు తాను కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు గిరిబాబు చెప్పారు. త్వరలో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాకినాడ, ప్రత్తిపాడు, పిఠాపురంలలో ఏదో ఒక నియోజకవర్గంనుంచి పోటీ చేసే అవకాశం ఉందని గిరిబాబు తెలిపారు. ఇదిలాఉండగా ముద్రగడతో బుధవారంనాడు జనసేన నేతలు భేటీ అయ్యారు. గంటన్నరసేపు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో చేరవలసిందిగా జనసేన నాయకులు ముద్రగడను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా గురువారంనాడు తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News