Wednesday, January 22, 2025

వైసిపిలో ముద్రగడ చేరిక వాయిదా

- Advertisement -
- Advertisement -

కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరిక వాయిదా పడింది. వాస్తవానికి ఆయన గురువారంనాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈమేరకు వెయ్యి కార్లలో తరలి రావాలంటూ ఆయన తన అనుచరులకు, కాపు నేతలకు పిలుపునిచ్చారు కూడా. అయితే అనూహ్యంగా ముద్రగడ చేరిక వాయిదా పడింది. ఇందుకు తనను క్షమించమంటూ ఆయన ప్రజలకు ఒక లేఖ రాశారు. భారీ సంఖ్యలో తాడేపల్లికి తరలివెళ్లడంవల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయని వర్తమానం అందడంతో తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ముద్రగడ తన లేఖలో తెలిపారు. ఈనెల 15న లేదా 16న తాను ఒక్కడినే తాడేపల్లికి వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరతానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News