Monday, December 23, 2024

పెరీరాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Mudslide in Pereira has killed at least 14 people

 

బొగోటా: కొలంబియా పశ్చిమప్రాంతంలో భారీ వర్షాల దాటికి పెరీరా మున్సిపాలిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న నివాస ప్రాంతాలను బురద ముంచెత్తింది. బురదలో కూరుకుపోయి 14 మంది చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక దవాఖానలకు తరలించారు. పెరీరా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే 60 ఇండ్లను ఖాళీ చేయించారు. సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News