- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ట్రైలర్ వచ్చేసింది. బేరీ జెంకిన్స్ దీనికి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇండియాలోనూ పలు ప్రాంతీయ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
తెలుగులో కూడా విడుదలవుతున్న ఈ మూవీకి సూపర్ స్టార్ మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్ ముఫాసాకు మహేష్ వాయిస్ ఇచ్చారుే. తాజాగా విడుదల అయిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజువల్స్ తోపాటు మహేశ్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం అలరించింది.
- Advertisement -