Monday, December 23, 2024

‘అమృత్ ఉద్యాన్’గా మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. మొఘల్ గార్డెన్స్‌పేరును ‘అమృత్ ఉద్యాన్’గా మార్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్‌కు అనుగుణంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ గార్డెన్‌కు అమృత్ ఉద్యాన్ పేరు పెట్టినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా ఒక ప్రకటనలో తెలియజేశారు.

మరో వైపు ఈ నెల 31నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 31వ తేదీనుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ప్రజల సందర్శన కోసం మార్చి 26 వరకు దాదాపు రెండు నెలల పాటు అమృత్ ఉద్యాన్‌లోకి ప్రవేశం కల్పించనున్నట్లు నవికా గుప్తా ఆ ప్రకటనలో తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News