Wednesday, January 22, 2025

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ముహమ్మద్ అలీ షబ్బీర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ముహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం పదవీ బాధ్యతలను స్వీకరించారు.  డా.బిఆర్ .అంబేడ్కర్ సచివాలయంలో, తన కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీకి రాష్ట్ర రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణ రావు, బిసి కమీషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు, న్యూ ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, జిఎడి కార్యదర్శి రఘునందన్ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్, పలువురు ప్రజాప్రతినిధులు పూల గుచ్చాలతో అభినందించారు.

Shabbir Ali 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News