Wednesday, January 8, 2025

బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పిస్తాం:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో హిందువులకు, ఇతర మైనారిటీ వర్గాలకు రక్షణ, భద్రత కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీకి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ శుక్రవారం ఫోన్‌లో హామీ ఇచ్చారు. షేఖ్ హసీనా ప్రభుత్వ పతనానంతరం యూనస్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనకు, మోడీకి మధ్య జరిగిన తొలి ఫోన్ సంభాషణ ఇదే. ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీలక బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఉంటుందని తాను పునరుద్ఘాటించినట్లు ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘జిఒబి ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ నుంచి ఒక టెలిఫోన్ కాల్ అందుకున్నాను.

ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలు పంచుకున్నాం. ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీలక బంగ్లాదేశ్‌కు భారత మద్దతును పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో హిందువులు, అన్ని ఇతర మైనారిటీలకు రక్షణ, భద్రతకు ఆయన హామీ ఇచ్చారు’ అని మోడీ తన పోస్ట్‌లో తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల భద్రత గురించి ప్రధాని మోడీ గురువారం తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆందోళన వెలిబుచ్చారు. ‘ఒక పొరుగు దేశంగా బంగ్లాదేశ్‌లో పరిణామాల పట్ల ఆందోళనను అర్థం చేసుకోగలను. అక్కడ పరిస్థితి త్వరలో సర్దుకుంటుందని ఆశిస్తున్నా’ అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News