Thursday, April 3, 2025

మోహర్రం త్యాగాలకు ప్రతీక: రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

మోహర్రం త్యాగాలకు ప్రతీక
రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

మనతెలంగాణ, సిటిబ్యూరో: మోహర్రం త్యాగాలకు ప్రతీక అని, ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. మోహర్రం జరుపుకుంటున్న వారు ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని కోరారు. మోహరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని, వీధి లైట్లు, ప్రథమ చికిత్స, సహాయం, తాగునీరు తదితర అత్యవసర సహాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇతర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులు ముందుగా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News