Monday, December 23, 2024

త్యాగాలకు ప్రతిక మొహర్రం

- Advertisement -
- Advertisement -

నల్గొండ:నల్గొండ పట్టణంలోని 27వ వార్డు లో మొహర్రం సందర్భంగా ముఖ్యఅతిథిగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని. బడేనాల్ సహాబ్ చోటే నాల్ సాబ్ సవారీలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మతాలకు అతీతంగా నిర్వహించే మొహర్రం పండుగను అందరూ సోదర భావంతో నిర్వహించడం అభి నందనీయమని త్యాగాలకు ప్రతీక మొహరం పండుగ అన్నారు.

ఓల్ సిటీలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈద్గా వరకు ఓల్ సిటీ గోల్ సిటీగా అభివృద్ధి చేయుట కొరకు మళ్లీ కెసిఆర్ ని గెలిపించుకొని నల్లగొండని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. అదేవిధంగా నల్గొండ ఓల్ సిటీ హర్షర్ఖానాకి స్లాపుకు ఎమ్మెల్యే నిధులలో నుంచి పది లక్షలు కేటాయిస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,సిపిఎం నాయకులు హాశం, సుధాకర్ రెడ్డి, సలీం, మరియు కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, కౌన్సిలర్లు పూజిత శ్రీనివాస్,అభిమన్యు శ్రీను, ఎడ్ల శ్రీనివాస్ టౌన్ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, యకులు ముభీన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News