- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : మొహర్రం త్యాగానికి ప్రతీక అని బిసి కమిషన్ చర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. నిజాం పాలిత ప్రాంతమైన తెలంగాణలో ముస్లింలే గాకుండా అన్ని వర్గాల ప్రజలు వందలాది ఏళ్లుగా మొహర్రంను జరుపుకుంటారని పేర్కొన్కారు. మొహర్రం జరిగే 10 రోజులు విషాద దినాలని, పర్వదినాలు ఏ మాత్రం కాదని అన్నారు. నాటి త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారని అన్నారు. ఆయన మంగళశారం మీరాలం మండీ వద్ద వేసిన వేదిక నుండి పాతనగరం నుండి ఊరేగింపుగా వస్తున్న మొహర్రం ప్రదర్శనకు, ఉరేగింపుకు దట్టీలు సమర్పించారు. గ్రామీణ, పట్టణము అనే తేడా లేకుండా త్యాగధనులను పీర్లుగా తయారు చేశారని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -