Tuesday, September 17, 2024

అల్లర్లతో అట్టుడికిన బంగ్లా.. ముజిబుర్ రెహ్మన్ విగ్రహం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

ఢాకాలో హసీనా తండ్రి, బంగ్లాదేశ్ పిత షేక్ ముజిబుర్ రెహ్మన్ భారీ విగ్రహంపై నిరసనకారులు దాడికి దిగి దీనిని ధ్వంసం చేశారు. దీనిపైకి ఎక్కి గునపాలు, గొడ్డళ్లతో పగుల గొట్టి తల విరగ్టొట్టి కొందరు తీసుకువెళ్లుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 1971 బంగ్లా విముక్తి నేత, దేశ ప్రజల పాలిటి హీరో అన్పించుకున్న ముజిబుర్ రెహ్మన్ పట్ల ఇప్పుడు జనం తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక దేశంలోని ధన్మోండి ప్రాంతంలోని ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ (ఐజిసిసి)ని అక్కడి బంగబంధు స్మారక మ్యూజియంను కూడా అరాచక గుంపు ధ్వంసం చేసింది. ఢాకా, ధన్మోడి, ఇతర పలు ప్రాంతాలలో అధికార అవామీలీగ్ పార్టీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్ నివాసాన్ని తగులబెట్టారు. సోమవారం కూడా పలు ప్రాంతాలలో జరిగిన హింసాత్మక ఘటనలలో ఆరుగురు మృతి చెందారు.

హసీనా దేశంలో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. హింసాత్మక ఘటనలు, వదంతుల నడుమ దేశంలో ఇంటర్నెట్‌పై పూర్తి స్థాయి నిషేధం విధించారు. అయితే మధ్యాహ్నం బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్రసారాలకు అధికార వర్గాల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం నాటి నిరసనలకు జనం వీధుల్లోకి తరలివచ్చిన దశలో వారిని నియంత్రించేందుకు భారీగా పోలీసులు, సైనిక బలగాలు మొహరించాయి. హసీనా వ్యతిరేకులకు, అవామీలీగ్ మద్దతుదార్లకు మధ్య ఘర్షణలు జరిగే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల కర్ఫూను ధిక్కరించి జనం రోడ్లపైకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News