- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హాలీడే ఫాంహౌస్ లో ఎస్ఒటి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏడుగురు యువతులు, 13 మంది యువకులు అర్థనగ్నంగా నృత్యాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఫాంహౌస్ నుంచి 70 గ్రాముల గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు అమ్మాయిలు, 13 మంది యువకులను అరెస్ట్ చేశారు. బర్త్ డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ముంబయి నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టైన వారు పాతబస్తీకి చెందిన యువకులుగా గుర్తించారు.
- Advertisement -