Friday, December 20, 2024

ముజ్రా పార్టీ భగ్నం

- Advertisement -
- Advertisement -

12మంది అరెస్టు, నిందితుల్లో నలుగురు ట్రాన్స్‌జెండర్ల
మనతెలంగాణ, సిటిబ్యూరో: ముజ్రా పార్టీని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బండ్లగూడ పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. ముజ్రా పార్టీ ఏర్పాటు చేసిన వ్యకి పాల్గొన్న ఏడుగురు, నలుగురు ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని బండ్లగూడకు చెందిన ఎండి జాబ్రీ బైక్ సర్వీసింగ్ సెంటర్ ఉంది, ఎండి రియాజ్, షేక్ సోహైల్, షానవాజ్ ఖాన్, ఎండి ఇమ్రాన్, ఎండి ఫిరోజ్, సయిద్ షా ఫరూఖీ, షేక్ మహ్మద్, సోహైల్ అలియాస్ అర్జో, ఎండి సైఫ్; కరీమా బక్షా, అబ్దుల్ అమీర్‌ను అరెస్టు చేశారు. బండ్లగూడకు చెందిన హమీద్ ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొనేందుకు మిగతావారు వచ్చారు. పార్టీలో పెద్దగా సౌండ్స్ పెట్టి ట్రాన్స్‌జెండర్లతో నృత్యాలు చేయిస్తున్నారు.ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నవీన్, నర్సింహులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News