Thursday, December 19, 2024

ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ ముకేష్ అంబానీకి చోటు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ మళ్లీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 10 మంది జాబబితాలో చోటు దక్కించుకున్నారు. బుధవారం ఆయన నికర ఆస్తులు మళ్లీ పెరిగిపోగా వరుసగా గత కొద్దిరోజులుగా నష్టాలను చవిచూస్తున్న అదానీ గ్రూపు కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీ నికర ఆస్తులు బుధవారం 1.7 బిలియన్ డాలర్లు క్షీణించాయి.

అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ షేర్ల ధరలు బుధవారం 1.97 పెరిగి రూ. 2424కు చేరుకోగా అదానీ గ్రూపు కంపెనీలలో కొన్నిటి షేర్లు నేడు రెడ్‌లో ట్రేడింగ్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు దిగువ స్థాయిలో ఆగిపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అఆదానీ పోర్టులు, ఎసిసి, అంబుజా సిమెంట్స్, ఎన్‌డిటివి షేర్లు గ్రీన్‌లో ట్రేడింగ్ అవుతున్నప్పటికీ గౌతమ్ అదానీ నికర ఆస్తుల పెరుగుదలకు అవి దోహదపడలేదు. ప్రస్తుతం&85.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడైన వ్యక్తే కాకుండా ప్రపంచంలోని 10 మంది కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News