- Advertisement -
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి వంద మంది అతిథులకు ఆహ్వానం పలికారు. భారత్ నుంచి ముఖేశ్-నీతు అంబానీలకు ఆహ్వానం అందింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ట్రంప్‌తో ముకేశ్-నీతూ అంబానీలు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
- Advertisement -