న్యూఢిల్లీ : వరుసగా రెండో సంవత్సరానికి రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఎలాంటి వేతనం తీసుకోలేదు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం కారణంగా అంబానీ ఎటువంటి జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆయన కంపెనీ నుండి జీతం తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వరుసగా రెండేళ్లు ఆయన జీతం తీసుకోలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ గత రెండేళ్లలో అలవెన్స్ గానీ, రిటైర్మెంట్ బెనిఫిట్, కమీషన్, స్టాక్ ఆప్షన్ గానీ తీసుకోలేదు. 2008-09 నుండి ముకేశ్ తన వేతనాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించుకున్నారు. 2019-20 వరకు 11 ఏళ్ల కాలంలో ఆయన జీతంలో ఎలాంటి పెంపుదల లేదు. ఆ తరువాతి రెండేళ్లలో ఆయన ఎలాంటి జీతం తీసుకోలేదు. 2020 జూన్‌లో దే శంలో కోవిడ్ మహమ్మారిసామాజిక, ఆర్థిక, పా రిశ్రామిక ఆరోగ్యంపై ప్రభావం చూపింది. దీం తో వేతనం తీసుకోవద్దని స్వచ్ఛందంగా నిర్ణయి ంచుకున్నట్టు ఆయన ప్రకటించారు.
ముకేశ్ అంబానీకి ‘సున్నా’ వేతనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -