Wednesday, January 22, 2025

ఆటో రంగంలోకి రిలయన్స్!.. ఎంజి మోటార్‌పై అంబానీ కన్ను

- Advertisement -
- Advertisement -

ఎంజి మోటార్‌పై ముకేశ్ అంబానీ కన్ను

ముంబై : దేశంలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ కొత్త రంగాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంపై దృష్టిపెట్టింది. 100 ఏళ్ల చరిత్ర కల్గిన బ్రిటీష్ కారు బ్రాండ్ మోరిస్ గ్యారెజ్(ఎంజి)ని కొనుగోలు చేయడానికి రిలయన్స్ సిద్ధమవుతోంది. ఎంజి మోటార్ తన భారతీయ యూనిట్ మెజారిటీ వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. వారిలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ డీల్ పట్ల ఆసక్తి చూపుతోంది. ఇంకా దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ హీరో, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, జెఎస్‌డబ్లు గ్రూప్ కూడా ఎంజి మోటార్ వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఎంజి మోటార్ ఒక ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్, దీనిని 1920లో స్థాపించారు. ఎంజి మోటార్ దశాబ్దాలుగా బ్రిటన్ బ్రాండ్ కారుగా ప్రాచుర్యం పొందింది. ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాగా బ్రిటీష్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. అయితే అనేక ఇతర బ్రిటిష్ బ్రాండ్‌ల మాదిరిగానే సంస్థ ఇప్పుడు ఇతర దేశాల కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ప్రస్తుతం చైనా కంపెనీ ఎస్‌ఎఐసి మోటార్స్ యాజమాన్యంలో ఉంది. అదే సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను చాలా సంవత్సరాల క్రితం టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఎంజి మోటార్ ఇండియా బృందం మెజారిటీ వాటాలను అంటే 50 శాతానికి పైగా వాటాలను విక్రయించడానికి వివిధ భారతీయ కార్పొరేట్ సంస్థలు, కుటుంబ కార్యాలయాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంజి మోటార్ ఇండియా ఈ ఏడాది చివరి నాటికి డీల్‌ను పూర్తి చేయాలని యోచిస్తోంది.

దీని ద్వారా వచ్చే నిధులు, ఇతర విస్తరణ ప్రణాళికలకు కంపెనీ ఉపయోగించనుంది. ఎంజి మోటార్ చాలా తక్కువ వ్యవధిలో భారతదేశంలో మంచి మార్కెట్‌ను పొందింది. కంపెనీకి చెందిన అనేక మోడల్స్‌కు భారతదేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు ఎంజి మోటార్ భారతదేశంలో కొత్త ప్లాంట్‌ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది, ఇది కంపెనీ తయారీ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసే అవకాశముంది. అయితే ఎంజి మోటార్ ఇండియా 50 శాతానికి పైగా వాటాలను విక్రయించాలనే ప్రణాళిక విషయంలో ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు కీలకపాత్ర పోషించనున్నాయి. భారత్, చైనా మధ్య సత్సంబంధాలు లేవు. గత 2, -3 సంవత్సరాలలో సైనిక ఉద్రిక్తత, అనేక సంఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News