Sunday, December 22, 2024

ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ!

- Advertisement -
- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల సంపద గల ధనవంతుల జాబితాలోకి చేరారు. అంతేకాదు, మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఒకే ఒక్కరోజులో ఆయన ఆస్తుల విలువ 2.76 బిలియన్ డాలర్ల మేరకు పెరగడంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ 12వ స్థానానికి చేరినట్లు బ్లూమ్ బర్స్ నివేదిక పేర్కొంది. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన గౌతమ్ అదానీని అధిగమించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు ఆర్జించడంతో ఈ ఏడాది ముఖేశ్ అంబానీ సంపద 5.47 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ను ప్రత్యేకంగా లిస్టింగ్ చేయడం వల్ల బీఎస్ఈపై దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.6 లక్షల కోట్లకు చేరింది. దాంతో ముఖేశ్ అంబానీ సంపద కూడా పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News