Monday, December 23, 2024

భారత్‌లోని 100 మంది కుబేరులలో ముకేష్ అంబానీ టాప్: ఫోర్బ్ జాబితా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లోని 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను లో మొదటి స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీకి దక్కింది. 2023 సంవత్సరానికి సంబంధించిన దేశంలోని అత్యంత సంపన్నులు 100 మంది జాబితాను ఫోర్బ్ గురువారం ప్రకటించింది. గత ఏడాది అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ దక్కించుకున్న స్థానాన్ని ఈ ఏడాది ముకేష్ అంబానీ దక్కించుకోవడం విశేషం.
ఈ ఏడాది ముకేష్ అంబానీకి చెందిన మొత్తం ఆస్తుల నికర విలువ 799 బిలియన్ డాలర్లుగాఫోర్బ్ తేల్చింది.
గత ఏడాది మొదటిసారి అంబానీ స్థానంలో దేశంలోని అత్యంత పంపన్నుడిగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న గౌతమ్ అదానీ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయారు.
హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు. ఓపి జింగ్రూపు చౌర్‌పర్సన్ సావిత్రీ జిందాల్ 4వ స్థానంలో నిలవగా అవెన్యూ అపార్ట్‌మెంట్స్ వ్యస్థాపకుడు రాధాకిషన్ దామని ఐదవ స్థానంలో ఉన్నారని ఫోర్బ్ ఏషియాకు చెందిన ఇండియా ఎడిటర్ నజ్నీన్ కర్మాలి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News