- Advertisement -
తిరుమల: వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమలకు విచ్చేసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రాధికా మర్చంట్ కూడా ఉన్నారు. ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం నిజపాద దర్శనంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అంబానీ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తిరుమలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ముఖేష్ అంబానీ ఆకాంక్షించారు.
- Advertisement -