Sunday, December 22, 2024

మంచి సందేశాన్ని చూపిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అ యేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిని మా ‘ముఖచిత్రం‘. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సి నిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీ న్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్‌కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నా రు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా మీడియాతో హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ “ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి విజయవాడకు చెందిన ఓ చిన్న టౌ న్ అమ్మాయి. తను చాలా అమాయకురాలు. సిటీ లైఫ్ ఆమెకు తెలియదు. అలాంటి అమ్మాయి ఒక పేరున్న డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటుంది. ఈ పాత్రలో నేను నటించాను. మరొక క్యారెక్టర్ చాలా రఫ్ అం డ్ టఫ్‌గా ఉండే సిటీ అమ్మాయి. ఆమె మాయా ఫె ర్నాండేజ్. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూ పిస్తున్నాం”అని అన్నారు. హీరోయిన్ అయేషా ఖా న్ మాట్లాడుతూ “ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్‌లో ఎలా ఉం డాలనే విషయంలో అన్నీ తెలిసిన అమ్మాయి ఆమె. నేను చేసిన మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టం”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News