Thursday, January 23, 2025

ఆసక్తిరేకెత్తిస్తున్న ‘ముఖచిత్రం‘ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం‘. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్‌కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ “ముఖచిత్రం… చిన్న చిత్రంగా మొదలైంది కానీ విశ్వక్ సేన్ మా టీమ్ లోకి వచ్చాక పెద్ద సినిమా అయ్యింది. టీజర్ కట్ చేసి ఆయనకు చూపించినప్పుడు, నా పాత్ర ఏంటి అని కూడా అడగకుండా ఈ సినిమా నేను చేస్తాను మీరు షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి అన్నారు.

ఈ క్యారెక్టర్ ఆయన ఎందుకు చేశాడు? అనేది రేపు థియేటర్లలో చూసినప్పుడు అర్థమవుతుంది”అని తెలిపారు. హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ “నేను ఈ క్యారెక్టర్ చేయగలనని నమ్మిన దర్శకుడికి థాంక్స్. విశ్వక్ సేన్ రావడంతో మా సినిమా మరింత బిగ్ స్పాన్‌లోకి వెళ్లింది. కాల భైరవ సంగీతం ఆకర్షణగా నిలుస్తుంది”అని అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ “మంచి వాయిస్ ఉన్న క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. ముఖ చిత్రం షూటింగ్ చేస్తున్న రెండు రోజులు ఒక వైబ్రేషన్ లో ఉండిపోయాను. మూవీ కంటెంట్ కొంత చూసినప్పుడు ఈ చిత్రంలో పార్ట్ అవ్వాలి అనిపించింది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, ఎస్కేఎన్, సాయి రాజేష్, కాలభైరవ, సందీప్ రాజ్ పాల్గొన్నారు.

Mukhachitram Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News