Tuesday, November 5, 2024

దేశానికి ఆదర్శంగా ముఖరా కే గ్రామం

- Advertisement -
- Advertisement -

Mukhara Ke village is an ideal for the country

హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ముఖరా కే గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామాన్ని చూసి, అధ్యయనం చేసి, ఆ మోడల్ ను అనుసరిస్తున్నాయి. ఆ గ్రామాన్ని అంతగా తీర్చిదిద్ది, మన రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లను, కార్యదర్శిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఇటీవల పూణే లో జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనం లో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరచిన గ్రామంగా మరోసారి గుర్తింపు పొందిన సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి ఎంపీటీసీ గాడ్గె సుభాష్ లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ని మంగళవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పూణే లో పొందిన అవార్డు ను మంత్రి కి చూపించారు.

వారిని అభినందించిన మంత్రి మాట్లాడుతూ, పూణే లో జరిగిన జాతీయ స్థాయి పంచాయతీ రాజ్ సమ్మేళనం లో పాల్గొన్న దేశంలోని 5 గ్రామాల్లో ముఖ రా కే గ్రామం అత్యున్నత స్థానం పొందిందని చెప్పారు. ఇదిగాక, అన్ని రంగాల్లో ముఖ్రా కే గ్రామం ఆదర్శంగా నిలిచిందన్నారు.

రాష్ట్రంలో సీఎం కెసిఆర్ చేపట్టిన అనేక పథకాలు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాయి. ప్రత్యేకించి సీఎం కెసిఆర్ మేధోమథనం పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధించింది అన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపింగ్ యార్డు, స్మశాన వాటిక, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, కొత్త గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు, సాగు నీరు, 24 గంటల కోతల్లెని విద్యుత్… అనేక పథకాలు గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పరుస్తున్నాయి అన్నారు. ఇంకా సంక్షేమ పథకాలు కూడా అమలు కావడంతో గ్రామాల్లో మౌలిక వసతులు శాశ్వత ప్రాతిపదికన ఏర్పడ్డాయని, మనుషుల జీవన ప్రమాణాలు పెరిగాయని మంత్రి అన్నారు. ఇక కేవలం చెత్త ను ఎరువుగా మార్చి ఆదాయం పొందుతున్న గ్రామం కూడా ముఖ్ర కే గ్రామం ముందుంది అన్నారు. ఇదే పనితీరును కొనసాగించాలని వారికి మంత్రి సూచించారు. ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి ని, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, కార్యదర్శి, ప్రజలను మంత్రి మరోసారి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News