Monday, December 23, 2024

హిందీ పాట పాడిన దక్షిణాఫ్రికా క్రికెటర్! వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఆఫ్రికన్లు టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఆ మధ్య ఓ ఆఫ్రికన్ పాడిన పాత తెలుగు పాట “అయ్యయ్యో జేబులొ డబ్బులు పోయెనే” నెట్టింట ఎంత హిట్టయిందో తెలిసిందే. వచ్చీరాని తెలుగులో అతను పాడిన పాట చూసి నవ్వుకోని వారు లేరు. మరోవైపు ఇంత పట్టుదలగా తెలుగుపాట నేర్చుకుని పాడినందుకు మెచ్చుకున్నవారూ ఉన్నారు.

తాజాగా ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎన్టిని ఓ హిందీ పాట పాడి, సంగీతాభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. అతను పాడిన పాట ఏంటో తెలుసా? అమితాబ్, శశికపూర్ నటించిన ఒకప్పటి ‘కభీ కభీ’ అనే సినిమాలోని టైటిల్ సాంగ్. మెలోడిని ఇష్టపడే సంగీతప్రియులు ఈ పాట అంటే చెవి కోసుకుంటారు. ఇదే పాటను ఎన్టిని పాడాడు. పైగా అతనిచేత మన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దగ్గరుండి మరీ ఈ పాట పాడించడం విశేషం. మరి, ఎన్టినీ ఎలా పాడాడో మీరూ చూడండి!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News