Monday, January 20, 2025

రాష్ట్రాభివృద్ధికి ‘ముఖ్రా’ ముఖ చిత్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి ముఖ్రా (కె) గ్రామమే ప్రధాన ముఖచిత్రమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, -ప్రతి ఇంటికి కెసిఆర్ పేరుతో ముఖ్రా (కె) గ్రామంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ఆయన మెచ్చుకున్నారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం అమలుచేయనన్నీ సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. వాటిని ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకువెళ్లాలన్నారు. ఇందుకోసం ముఖ్రా (కె) గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి చేస్తున్న వినూత్న ప్రచారం బాగుందని కెటిఆర్ మెచ్చుకున్నారు. మంగళవారం కెటిఆర్‌ను కలిసి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రచారం పోస్ట్న్రు చూపించారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ…. ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్దిదారుల ఇంటిముందు పూర్తి వివరాలతో కూడిన పోస్టర్‌ను ఉంచడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.34 కోట్ల నిధులను ముఖ్రా (కె) అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన వివరాలను గ్రామంలో ఫ్లెక్సీలా ఉంచడం ప్రశంసనీయన్నారు. రాష్ట్రంలోని మిగతా గ్రామపంచాయితీల్లోనూ ముఖ్రా (కె)లో చేస్తున్నట్టుగానే చేయాలని కెటిఆర్ సూచించారు.

పల్లె ప్రగతి కార్యక్రమంతో ముఖ్రా (కె)ను జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దిన సర్పంచ్ గాడ్గే మీనాక్షిని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తడి చెత్తతో గ్రామపంచాయితీకి ఆరు లక్షల రూపాయలు ఆదాయంగా రావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన రాష్ట్రంలోని మిగతా గ్రామాలు ముఖ్రా (కె)ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికి మరింత తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హామి ఇచ్చారు.
అనంతరం సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమకోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్న తమ ప్రయత్నాన్ని కెటిఆర్ అభినందించిడం మరింత స్పూర్తినిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశనం, మంత్రి కెటిఆర్ ప్రొత్సాహంతో ముఖ్రా (కె) ను మరింత అభివృద్ధి చేసేందుకు పనిచేస్తానని మీనాక్షి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News