గ్రీన్ ఛాలెంజ్‌తో ఆకుపచ్చ గ్రామంగా అవతరణ, హరిత శోభతో కళకళ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలనిస్తోంది. ఇప్పటివరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కోట్ల మొక్కలను నాటగా పర్యావరణ సమతుల్యతతో పాటు పచ్చదనం పెరిగి ఎటూ చూసిన గ్రీన్ విలేజీలే కనబడుతున్నాయి. ఇందుకు ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రాకె గ్రామం.
నాడు ఎడారిగా ఉన్న ముఖ్రాకె ను నేడు ఆకుపచ్చని ముఖ్రాకెగా మార్చిన ఎంపి సంతోష్ కు ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. నాడు ఎంపి సంతోష్ ఇచ్చిన పిలుపుతో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గ్రామస్తులంతా పల్లె ప్రకృతి వనంలో 20 వేల మొక్కలను నాటారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనగా అది ఇప్పుడు సత్ఫలితా న్నిస్తోంది. ఆకుపచ్చని ముఖ్రాకె దర్శనమిస్తోంది. గ్రీన్ ఛాలెంజ్‌లో నాటిన మొక్కలు నేడు పెద్దగా అయ్యి ఆకుపచ్చని ముఖ్రాకె గా దర్శనమిస్తోంది.