Tuesday, January 21, 2025

మోడీని తిట్టడంలో కాంగ్రెస్ ఉన్మాదం

- Advertisement -
- Advertisement -

Mukhtar abbas naqvi comments on congress

విరుచుకుపడ్డ మైనార్టీ మంత్రి నక్వీ

న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తిట్టిపోయడం ఓ క్రేజ్‌గా మారిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ విమర్శించారు. ప్రధానిని విమర్శించే రాహుల్ వైఖరి చివరికి దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రల స్థాయికి చేరిందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయన హజ్ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడి ఇప్పుడు వెంటిలేటర్లపై ఉంది. అయితే ఆ పార్టీ నేతల దురుసు వైఖరి మితిమీరుతోందని మంత్రి విమర్శించారు. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ మాటలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటుందన్నాయి. బిజెపి సిద్ధాంతాలను కించపర్చేలా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారింది , చివరికి ఈ పార్టీ గల్లీలకు పరిమితం అవుతోంది.

ఇదంతా కూడా ఈ పార్టీ తలకెక్కిన ప్రతికూల ఫ్యూడల్ మైండ్‌సెట్ ఫలితంగా దాపురించిందని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఫ్యామీలీ ఫోటోల చట్రానికి పరిమితం అయింది. చివరికి ఇది బూటకపు కిట్టిపార్టీల దశకు దిగజారిందని అన్నారు. పార్టీ అంతర్గత పరిణామాలతోనే వలసలు మిక్కుటం అయ్యాయని అన్నారు. రాహుల్ ఇతర కాంగ్రెస్ నేతలు విదేశాలకు వెళ్లి మాట్లాడే తీరు దేశాన్ని అప్రతిష్ట పాలుచేసే విధంగా ఉంటోందని అన్నారు. ప్రధాని మోడీని విమర్శించేందుకు ఏకంగా దేశాన్ని దిగజార్చే మాటలు అనుచితం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News