Wednesday, January 22, 2025

ముఖ్తర్ అన్సారీకి పదేళ్లు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

లక్నో: బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో రాజకీయవేత్తగా మారిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి ఉత్తరప్రదేశ్ ఘజియాపూర్ కోర్టు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ముఖ్తర్ అన్సారీ సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై కోర్టు తీర్పును రిజర్వు చేసింది. 2005లో అప్పటి బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కృష్ణానంద్ రాయ్‌ను అన్సారీ సోదరుడు కిడ్నాప్ చేసి హత్య చేశారన్న నేరారోపణలు ఉన్నాయి.

Also Read: చాలా డిఫరెంట్ రోల్ చేశా: హీరోయిన్ మాళవిక నాయర్

2001ఉస్రి ఛట్టి గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా ఈ ఏడాది జనవరిలోనే ముఖ్తర్‌పై హత్య కేసు నమోదయింది. దీంతోపాటు అనేక ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు సార్లు ఎమ్‌ఎల్‌ఎగా చేసిన ముఖ్తర్ విశ్వహిందూ పరిషత్ నేత నందకిశోర్ రుంగ్తాను 1996లో కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు వెలువడిన తరువాత హతుడు రాయ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News