Monday, January 20, 2025

భద్రాద్రి రామాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి

- Advertisement -
- Advertisement -

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భద్రాద్రి రామలయంలో ఉత్తర ద్వార దర్శనం మహోత్సవానికి ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్  పాల్గొని ఉత్తర ద్వారంగా సీతారాముల వారిని దర్శించుకున్న అనంతరం రామాలయంలో సీతారాముల వారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ సీతారాముల వారిని దర్శించుకుని దేశం మెచ్చే సుభిక్షమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని, వారు స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి దేశ ప్రజలందరికీ చేరువ కావాలని, తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News