Monday, December 23, 2024

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

- Advertisement -
- Advertisement -

తిరుమలలో శుక్రవారం అర్థరాత్రి 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకుంది. శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రావణవాహన సేవలో భక్తులకు స్వామివారు, అమ్మవారు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

యాదరిగిగుట్ట లక్ష్మినరసింహస్వామి ఆలయంలో గరుడ వాహనంపై స్వామివారు ఉత్తరద్వార దర్శనం ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా హరిహరులు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి పాల్గొని, స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News