Wednesday, January 22, 2025

గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ముక్కు అవినాష్

- Advertisement -
- Advertisement -

Mukku Avinash planted by plants in Green Challenge

హైదరాబాద్: ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్.జె.సునీత విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన జబర్థస్త్ నటుడు ముక్కు అవినాష్ జూబ్లీహిల్స్‌లోని జిహెచ్‌ఎంసి పార్కులో తన సతీమణి అనూజతో కలిసి మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా ముక్కు అవినాష్, ఆయన సతీమణి అనూజలు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పెళ్లయిన తర్వాత మొదటిసారిగా మొక్కలు నాటుతున్నామని, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. పెరుగుతున్న పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్న రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతర్ గెటప్ శ్రీను, కెవ్వు కార్తీక్, కిరాక్ ఆర్పీ ముగ్గురికి ముక్కు అవినాష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News