Tuesday, November 5, 2024

పోటాపోటీగా వాదోపవాదాలు

- Advertisement -
- Advertisement -
Mukul Rohatgi argued Aryan case
ఆర్యన్ కేసు వాదించిన ముకుల్ రొహత్గీ

ముంబై : ఇంతకు ముందటి బెయిల్ దరఖాస్తులు రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో బొంబాయి హైకోర్టులో ఇప్పుడు ఆయన తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గీ వాదించారు. దీనితో కేసు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్యన్ అరెస్టు అనుచితం అని, రాజ్యాంగపరమైన భరోసా ప్రక్రియల తీవ్ర ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు. ఏ విధంగా కూడా బలం లేని కారణాలతో ఆర్యన్‌ను అరెస్టు చేశారని, కేవలం వాట్సాప్ సంభాషణలను ప్రాతిపదికగా చేసుకుని ఇతరత్రా కట్టుకథలతో అరెస్టులకు దిగడం భావ్యమా అని ప్రశ్నించారు. పైగా ఇప్పుడు ఎన్‌సిబి చెపుతోన్న వాట్సాప్ ఛాట్ రెండేళ్ల కిందటిది అని, దీనిని ఇప్పుడు ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారని సందేహం వ్యక్తం చేశారు. క్రూయిజ్ ఉదంతంతో ఈ ఫోన్ వాట్సాప్ ఛాట్‌కు ఎటువంటి లింక్ లేదన్నారు. వీరంతా యువప్రాయపు వారు. వీరిని విచారణల పేరిట ఈ విధంగా తిప్పడం భావ్యం కాదు. కావాలంటే వారిని రిహాబిలేషన్ కేంద్రాలకు పంపించాలి. ఎవరైనా అతి కొద్ది మోతాదులో మత్తుమందు తీసుకుని ఇక ముందు ఈ వ్యవసనం జోలికి పోనని చెపితే వారిని చికిత్స కేంద్రాలకు పంపించాలి, అంతేకానీ ఈ విధంగా వారిలో కసి పెంచేలా కస్టడీలకు విచారణలకు పంపించడం భావ్యం కాదని అన్నారు.

ఆర్యన్ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు : ఎన్‌సిబి

ఆర్యన్‌కు బెయిల్ నిరాకరణ గురించి ఎన్‌సిబి హైకోర్టులో తీవ్రస్థాయిలో తన వాదనలు వెలువరించింది. ఆర్యన్ డ్రగ్ అడిక్ట్ అని, ఆయన వద్ద వాణిజ్యపరంగా అక్రమ రవాణా స్థాయిలో నాటు మత్తు మందు ఉందనే విషయం వాట్సాప్ ఛాట్ ఆధారంగా వెల్లడయిందని తెలిపింది. ఇటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం అనుచితం అవుతుందని తెలిపింది. ఈ విధమైన తీవ్రస్థాయి కేసులలో బెయిల్ మంజూరు అనేది ఎప్పుడో కానీ జరగదు, అసాధారణం అవుతుంది. ఇవ్వాలనే రూల్ ఏమీ లేదని ఎన్‌సిబి తరఫు న్యాయవాదులు తెలిపారు. డ్రగ్స్ నేరాలు హత్యాసమాన నేరాల కన్నా దారుణం అని సుప్రీంకోర్టు ఇంతకు ముందటి కేసుల విచారణల దశలో తెలిపిందని గుర్తు చేశారు.

కేసులో తొలి ముద్దాయిగా ఉన్న ఆర్యన్ డ్రగ్స్ తీసుకోవడం ఇదే తొలిసారి కాదని లాయరు అనిల్ సింగ్ అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఆర్యన్ పూర్తిస్థాయిలో డ్రగ్స్ రవాణాలో చాలా ఏళ్లుగా ఉన్నట్లు ఏ విధంగా చెప్పగలరని న్యాయమూర్తి ఈ దశలో ఎన్‌సిబిని ప్రశ్నించింది. ఇందుకు కేవలం ఫోన్ కాల్స్‌ను ఆధారం చేసుకుంటున్నారా? అని నిలదీసింది. రేవ్‌పార్టీ జరిగినట్లు చెపుతోన్న క్రూయిజ్‌లో ఆ సమయంలో 1300 మంది ఉన్నారని, 500 గదులు ఉన్నప్పుడు రెండు గదులలో ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలితే మొత్తం హోటల్‌ను డ్రగ్స్ దందా పరిగణనలోకి తీసుకుంటున్నారా? లే ఈ ఇద్దరు వ్యక్తులనే దోషులుగా పేర్కొంటున్నారా? తెలియాల్సి ఉందన్నారు. ఏదీ జరగని దానిలో కుట్ర ఉన్నట్లు చెప్పడం వెనుక ఏదో ఉందని అనుకోవల్సి వస్తోందని రొహత్గీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News