Monday, December 23, 2024

ములాయం సింగ్‌కు షాక్… బీజేపీలో చేరిన అత్యంత సన్నిహితుడు

- Advertisement -
- Advertisement -

లక్నో: ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన శివకుమార్ బేరియా సోమవారం బీజేపీలో చేరారు. సమాజ్‌వాది ప్రభుత్వ హయాంలో బేరియా మంత్రి గానూ పనిచేశారు. కాగా, ఎస్‌పి ఎమ్‌ఎల్‌సి రమేశ్ మిశ్రా కూడా పార్టీకి గుడ్‌బై చెప్పి కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఈ నెల 13న ఎస్‌పీలో చేరిన బీజేపీ ధౌరారా ఎమ్‌ఎల్‌ఎ తిరిగి బీజేపీలో చేరారు.న ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణయాదవ్ బీజేపీలో చేరిన తరువాత ఈ వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ములాయం సింగ్ యాదవ్ బావమరిది, మాజీ ఎమ్‌ఎల్‌ఎ ప్రమోద్ గుప్తా కూడా ఈనెల 20న బీజేపీ కండువా కప్పుకున్నారు.

Mulayam Singh close aide Shiv Kumar Beria Joins BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News