- Advertisement -
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణయాదవ్ బుధవారం బిజెపిలో చేరారు. ఆ పార్టీ కార్యాలయంలో బిహార్ డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బిజెపి యూపి అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బిజెపి సభ్యత్వం స్వీకరించారు. తనకు దేశం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందన్న అపర్ణ, మోడీ పనితీరును ప్రశంసించారు. అపర్ణయాదవ్ ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ సతీమణి. అపర్ణ లక్నో కాంట్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 2017లో అదే స్థానం నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అపర్ణ బీజేపిలో చేరడం సమాజ్‌వాది పార్టీకి పెద్ద షాక్‌గా భావిస్తున్నారు.
Mulayam singh daughter in law joins BJP
- Advertisement -