Thursday, January 23, 2025

ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూత

- Advertisement -
- Advertisement -

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపకులు, యుపి మాజీ సిఎం, ఎంపి ములాయం సింగ్ యాదవ్ (82)సోమవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం తుదిశ్వాస విడిచారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ములాయం సేవలందించారు. కేంద్రమంత్రిగా పార్లమెంటేరియన్‌గా పని చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ముణిపురి నుంచి ఎంపిగా గెలిచారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేరారు. ఎస్ పి కార్యకర్తలు ములాయం సింగ్ ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకునేవారు.

ఈతావా జిల్లా సైఫాయి గ్రామంలో మూర్తి దేవీ, సుఘర్ సింగ్ యాదవ్ అనే దంపతులకు 1939 నవంబర్ 22న  ములాయం జన్మించారు. 1970 నుంచి ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలక వ్యక్తిగా మారారు. ములాయం 1989 నుంచి 1991, 1993 నుంచి 1995, 2003 నుంచి 2007 వరకు యుపి సిఎంగా పని చేశారు. 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ములాయంసింగ్ యాదవ్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు.  ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కర్మ క్షేత్ర పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీ నుంచి బిఎ, ఎ కె కాలేజీ నుంచి బిటి, ఆగ్రా యూనివర్సీటికి చెందిన బిఆర్ కాలేజీలో ఎంఎ చదివారు. 1974లో ములాయం సింగ్ మల్టీ దేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ ములాయం-మల్టీ దేవి దంపతులకు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుమారుడు ఉన్నారు. సధానా గుప్తా అనే మహిళను ములాయం రెండో పెళ్లి చేసుకున్నాడు. సధానా గుప్త జులై నెలలో చనిపోయింది.

Mulayam Singh Yadav critical

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News