లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపకులు, యుపి మాజీ సిఎం, ఎంపి ములాయం సింగ్ యాదవ్ (82)సోమవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం తుదిశ్వాస విడిచారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ములాయం సేవలందించారు. కేంద్రమంత్రిగా పార్లమెంటేరియన్‌గా పని చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ముణిపురి నుంచి ఎంపిగా గెలిచారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేరారు.
1939: ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించారు.
1967: రామ్‌మనోహర్ లోహియాకు చెందిన సంయుక్త్ సోషలిస్ట్ పార్టీ ఎమ్‌ఎల్‌ఎగా మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ లోకి
అడుగుపెట్టారు.
1968: చౌదరి చరణ్‌సింగ్‌కు చెందిన భారతీయ క్రాంతిదళ్‌లో చేరారు. ఆ పార్టీ సంయుక్త సోషలిస్టు పార్టీతో విలీనమై భారతీయ లోక్‌దళ్ పార్టీగా అవతరించింది. ఎమర్జెన్సీ తరువాత (197577) భారతీయ లోక్‌దళ్ పార్టీ జనతాదళ్‌లో విలీనం అయింది.
1977: మొట్టమొదటి సారి మంత్రి అయ్యారు.
1982-87:శాసన మండలి సభ్యుడై …మండలిలో విపక్ష నాయకుడయ్యారు.
1996 : ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి నుంచి మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర రక్షణ మంత్రి పదవి చేపట్టారు.
1998 : ఉత్తరప్రదేశ్ సంభాల్ నియోజక వర్గం నుంచి మళ్లీ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
1999 : సంభాల్ నుంచి మళ్లీ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
1980 :లోక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.
1985-87 : జనతాదళ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని వరించారు.
1989-91 : మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
1992 : సమాజ్‌వాది పార్టీని స్థాపించారు.
1993-95 : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిని సాధించారు.
2003 : మూడోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
2003 : భార్య మాలతీదేవి మరణం… సాధనా గుప్తాతో మళ్లీ వివాహం
2004 : మెయిన్‌పురి నుంచి ఎంపి అయ్యారు.
2007 : యుపి రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నాయకుడయ్యారు.
2009 : మెయిన్‌పురి నుంచి ఎంపి అయ్యారు.
2014 : అజంఘర్, మెయిన్‌పురి నియోజక వర్గాల నుంచి ఎంపిగా ఎన్నిక కాగా, మెయిన్‌పురి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
2019: ఏడవసారి మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
2022 : గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో మరణించారు.