Tuesday, November 5, 2024

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

ములాయం అంతిమ దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన
అభిమానులు అంజలి ఘటించిన సిఎం కెసిఆర్,
ఎంఎల్‌సి కవిత అఖిలేశ్‌ను పరామర్శించిన సిఎం
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా వివిధ పార్టీల నేతల
నివాళి వర్షాన్ని సైతం లెక్కచేయని కార్యకర్తలు

n అంతిమ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు

సైఫాయి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకు డు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు వే లాది మంది అభిమానుల అశ్రునయనాల మ ధ్య ఆయన స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయిలో మంగళవారం మధ్యాహ్నం పూ ర్తయ్యాయి. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ చితికి నిప్పంటించి అం త్యక్రియలు నెరవేర్చారు. అంతిమయాత్రకు వేలాది మంది కార్యకర్తలు,అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. ‘ నేతా జీ అమర్ రహే’ నినాదాలతో సైఫాయి గ్రా మం మారుమోగింది. గురుగ్రాంలోని మే దాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 82 ఏళ్ల ములాయం సోమవారం కన్ను మూసిన విషయం తెలిసిందే. అంత్యక్రియల కో సం మృతదేహాన్ని ఆస్పత్రినుంచి ఆయన స్వగ్రా మం సైఫాయికి తీసుకువచ్చారు. ప్రజల అంతిమ దర్శనం కో సం ములాయం భౌతిక కాయాన్ని ఉదయం పది గంటలకు ఆయన నివాసంనుంచి మేళా మైదానంలోని విశాలమైన హాలుకు తరలించారు.

భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ములాయం భౌతి క కాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. తమ ప్రియతమ నేతకు కడసారి నివాళి అర్పించారు. అక్కడినుంచి ములాయం భౌతిక కాయాన్ని పూల తో అలంకరించిన వాహనంలో అంత్యక్రియ లు నిర్వహించే ప్రాంతానికి తీసుకువెళ్లారు. ములాయం కుమారుడు, యుపి మా జీ ము ఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ ఇతర కుటుం బ సభ్యులు భౌతిక కాయంతో పాటు గా వా హనంలో వెళ్లారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎన్‌సిపి చీఫ్ శరద్ ప వార్ , వివిధ పార్టీలకు చెందిన నేతలు, పలువురు ముఖ్యమంత్రులు, ములాయంకు ని వాళి అర్పించిన వారిలో ఉన్నారు. రాజస్థా న్ సిఎం అశోక్ గెహ్లా ట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, టిడిపి అధినేత చంద్రబాబు, బీ హార్ ఉపముఖ్యమంత్రి తేజ స్వి యాదవ్, సిపిఎం నేతలు ప్రకాశ్ కారత్, ఏ చూరి, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఎంపి, నటి జయా బచ్చన్, ఆమె కుమారుడు అభిషేక్ బచ్చన్ తదితరు లు ములాయంకు నివాళి అర్పించారు.

అఖిలేష్‌కు కెసిఆర్ ఓదార్పు

మన తెలంగాణ/ హైదరాబాద్ : సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరయ్యారు. ములాయంకు శ్రద్ధాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. మంగళ వారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, ములాయం సింగ్ యాద వ్ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా, సైఫాయి గ్రామానికి ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్ మధ్యాహ్నం చేరుకున్నారు. తమ మహా నేత చివరి దర్శనానికి అక్కడకు విచ్చేసిన స్థానిక లక్షలాది జన సమూహాన్ని దాటుకుంటూ, ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహం వద్దకు సిఎం కెసిఆర్ చేరుకున్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ములాయం సింగ్ యాదవ్ పార్థీవ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.

ఇంటి పెద్దను కోల్పోయి శోక తప్త హృదయులైన కుటుంబ సభ్యులను పలకరించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆలింగనం చేసుకుని ఓదార్చి స్వాంతననిచ్చారు. ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన సిఎం కెసిఆర్ నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వెంట రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌ఎసి కవిత, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News